బెంగళూర్‌లో రెండో రోజు ప్రధాని రోడ్ షో..
- May 07, 2023
బెంగళూరు: కర్ణాటకలో వరుసగా రెండో రోజు ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించారు. శనివారం నగరంలో సుమారు 26 కి.మీ మేర రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం మరో 10 కి.మీ మేర రోడ్ షో కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( NEET ) పరీక్ష దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రోడ్‌షోను కుదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఆదివారం ఉదయం 10 గంటలకు న్యూ తిప్పసాంద్ర రోడ్ లోని కెంపేగౌడ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభమైంది. కెంపేగౌడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం సెంట్రల్ బెంగళూర్ 5 నియోజకవర్గాలను టచ్ చేస్తూ ప్రధాని రోడ్ షో కొనసాగుతోంది. ప్రధాని వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపి పీసీ మోహన్‌లు ఉన్నారు. ఆదివారం రోడ్ షో ముగిసిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు బహిరంగ సభల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. మే 10న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







