ఈద్ అల్ అధా: ఉద్యోగులకు 6 రోజులపాటు సెలవులు..!
- May 07, 2023
యూఏఈ: ఈద్ అల్ అధా కోసం వచ్చే నెలలో యూఏఈ నివాసితులకు ఆరు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఏప్రిల్‌లో ఈద్ అల్ ఫితర్ తర్వాత సంవత్సరంలో ఇది రెండవ లాంగ్ వీకెండ్ కానుంది. ఈద్ అల్ అదా సందర్భంగా, ప్రభుత్వం నాలుగు రోజుల సెలవులను ప్రకటించింది. ఇందులో ఒక రోజు అరఫా, మూడు రోజుల ఈద్ ఉన్నాయి. ఖగోళ గణనల ఆధారంగా, యూఏఈలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల జుల్ హిజ్జా 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు సెలవులను ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. ఈద్ అల్ అదా (దీనిని త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారు) జూన్ 27 నుండి జూలై 2 వరకు (వారాంతంతో సహా) జరుపుకోనున్నారు.
అయితే, యూఏఈ నివాసితులు ఈ ఆరు రోజుల వీకెండ్ ను 9 లేదా 10 రోజుల సెలవులుగా మార్చుకునే అవకాశం ఉంది. జూన్ 26 నాడు ఒక రోజు సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటే, వారి కంపెనీలు కూడా దీనిని ఆమోదించినట్లయితే.. ఈ లెక్కల ఆధారంగా, యూఏఈలోని ఉద్యోగులు జూన్ 24 నుండి జూలై 2 వరకు 9 రోజుల విరామం పొందవచ్చు. మరోవైపు షార్జా ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తులు 10 రోజుల విరామం పొందవచ్చు. ఎందుకంటే ఎమిరేట్‌లో వారానికి నాలుగు రోజుల పని విధానం అమల్లో ఉంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









