ఏపీలో NEET కు 60 వేల మంది హాజరు

- May 07, 2023 , by Maagulf
ఏపీలో NEET కు 60 వేల మంది హాజరు

వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET) ఆదివారం ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 499 నగరాల్లో 4,702 పరీక్ష కేంద్రాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) ఏర్పాటు చేసింది. 14 పరీక్ష కేంద్రాలను ఇతర దేశాల్లో ఏర్పాటు చేసింది. తెలుగుతో పాటు 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించింది. రాష్ట్రంలో సుమారు 60 వేల మంది పరీక్షలు రాశారు. వీరికోసం గుంటూరు, కర్నూల్, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నరసరావుపేట, మచిలీపట్నం, అనంతపూర్‌, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, నంద్యాల, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తణుకు, విజయనగరం చోట్ల సుమారు 150 కేంద్రాలను ఎన్‌టిఎ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్ష జరిగింది. నిమిషం ఆలస్యమైనా విద్యార్ధులను లోపలికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేసి విద్యార్థులను లోపలికి పంపించారు. విద్యార్థులు లోహాలతో తయారు చేసిన ఉంగరాలు, ముక్కు పుడకలు ధరించి వస్తే వాటిని తొలగించి, అనంతరం వారిని లోపలికి అనుమతించారు. కెమిస్ట్రీ, బోటనీ పేపర్లు కొంచెం కష్టంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిజిక్స్‌, జువాలజీ సరళంగానే ఉన్నాయని తెలిపారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు కారణంగా అక్కడ పరీక్షను నిర్వహించలేదు. పరీక్ష అన్సర్‌ 'కీ' నీ ఈ నెల చివరిలో ఎన్‌టిఎ విడుదల చేసే అవకాశం ఉంది. జూన్‌ నాల్గవ వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అన్సర్‌ కీ, ఫలితాలను అభ్యర్థులు http://www.nta.ac.inhttps://neet.nta.nic.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com