కువైట్ లో 33 డీజిల్ కంటైనర్లు స్వాధీనం
- May 08, 2023
కువైట్: ఎగుమతి చేయడం నిషేధించబడిన పెట్రోలియం డెరివేటివ్ (డీజిల్) 33 కంటైనర్లను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది. డీజిల్ కంటైనర్లను స్వాధీనం చేసుకున్న తరువాత ఉత్తర నౌకాశ్రయాలు, ఫైలాకా ద్వీపం ఇన్స్పెక్టర్లు వాటిని కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్‌పిసి)కి అప్పగించినట్లు పేర్కొంది. కంటైనర్లు గల్ఫ్ దేశాలలో ఒకదానికి వెళుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కువైట్ ఫైర్ ఫోర్స్ సమన్వయం, సహకారంతో కెఎన్పిసికి చెందిన ట్యాంకుల్లో కంటైనర్లను అన్లోడ్ చేశామని వెల్లడించింది. ఈ సందర్భంగా KNPC, కస్టమ్స్ వేగవంతమైన ప్రతిస్పందనకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ సులైమాన్ అల్-ఫహద్ అభినందించారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!







