దానా మాల్‌లో ‘EPIX సినిమా’ ప్రారంభం

- May 08, 2023 , by Maagulf
దానా మాల్‌లో ‘EPIX సినిమా’ ప్రారంభం

బహ్రెయిన్: దానా మాల్‌లో $10 మిలియన్లతో నిర్మించిన కొత్త మల్టీప్లెక్స్ ‘EPIX సినిమా’ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వచ్చింది.  పది స్క్రీన్‌లు, 1,125 సీట్లతో, సినిమా లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ 3D సరౌండ్ సౌండ్, విలాసవంతమైన సీటింగ్ ఆప్షన్‌లను ఇది ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందజేయనుంది. ఉప ప్రధానమంత్రి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ముఖ్య అతిథిగా హాజరై ఈ సినిమాస్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో లులూ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, దాదాబాయ్ హోల్డింగ్ చైర్మన్ అబ్బాస్ దాదాబాయి, మేనేజింగ్ డైరెక్టర్లు కుతుబ్ దాదాబాయి, హతీమ్ దాదాబాయి పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com