‘గో ఫస్ట్‌’కు డీజీసీఏ నోటీసులు

- May 09, 2023 , by Maagulf
‘గో ఫస్ట్‌’కు డీజీసీఏ నోటీసులు

కువైట్: విమానాలను ఆకస్మికంగా రద్దు చేయడంపై గో ఎయిర్‌లైన్స్ (ఇండియా) లిమిటెడ్ (గో ఫస్ట్)కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గో ఫస్ట్ IBC కింద కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937 నిబంధనలు, సురక్షితమైన, సమర్ధవంతమైన, నమ్మదగిన రీతిలో సేవ ఆపరేషన్‌ను కొనసాగించడంలో గో ఫస్ట్ వైఫల్యం చెందినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన 15 రోజుల్లోగా తమ ప్రత్యుత్తరాన్ని సమర్పించాల్సిందిగా ఎయిర్‌లైన్ ఆపరేటర్‌ను కోరడం జరిగింది. వారు సమర్పించిన ప్రత్యుత్తరం ఆధారంగా వారి ఎయిర్ ఆపరేటర్ల సర్టిఫికెట్ (AOC) కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. ఆపరేషన్ కార్యక్రమాల కారణాల వల్ల మే 12 వరకు అన్ని విమానాలను రద్దు చేసినట్లు గో ఫస్ట్ విమానయాన సంస్థ శుక్రవారం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com