జూన్ 26న అన్ని ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలా?
- May 09, 2023
దుబాయ్: జూన్ 26న అన్ని పాఠశాలలను మూసివేయాలని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందు ప్రైవేట్ పాఠశాలల మూసివేతపై ఒక వార్తా వెబ్‌సైట్ పేర్కొన్న కథనం అనేక సందేహాలను లేవనెత్తింది. దీంతో అథారిటీ పుకార్లకు తెరదించుతూ.. ట్వీటర్ లో క్లారిటీ ఇచ్చింది. ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ అదాకు ప్రకటించిన సెలవులకు ఒక రోజు ముందు పాఠశాలలు మూసివేయబడతాయని నివేదికలో అథారిటీ పేర్కొంది.
ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, యూఏఈ నివాసితులు జూన్ 27 నుండి ఈద్ అల్ అదా కోసం ఆరు రోజుల సెలవులను ప్రకటించారు. సాధారణ విద్యా క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్‌లో (2022-23 విద్యా సంవత్సరం) ప్రారంభమైన పాఠశాలలు జూన్ 28 లోపు ముగియకూడదు. వారి కొత్త విద్యా సంవత్సరం (2023-24) ఆగస్టు 28న ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌లో 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన పాఠశాలలకు.. వేసవి సెలవులు జూలై 3న ప్రారంభమవుతాయి. ఆగస్టు 28న తరగతులు పునఃప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







