యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో 'కెసిఆర్ కృతజ్ఞత సభ'
- May 10, 2023
లండన్: దళితజనోద్ధరణకు కంకణం కట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రిటన్ సమాజం వేనోల్లా పొగుడుతున్నది. వివక్షకు గురవుతూ విస్మిరించబడిన ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధికోసం సిఎం కేసీఆర్ దార్శనికతతో దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు కార్యాచరణ దేశంలో ఇప్పటికే వో విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. దళితబహుజన సబ్బండ కులాల అభ్యున్నతికోసం సిఎం కేసీఆర్ కార్యాచరణ దేశం నలుదిక్కులనుంచి ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ఖ్యాతి విశ్వానికి పాకింది. ఇప్పటికే తన లేఖద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి కార్యాచరణను ప్రశంసిస్తూ లేఖ రాసిన బ్రిటన్ ఎంపీలు సోమవారం నాడు లండన్ ఇతర ప్రజాప్రతినిధులు బ్రిటన్ పౌరులు ఎన్నారైలతో కలిసి ‘‘ సిఎం కేసీఆర్ కు కృతజ్జతలు తెలుపుతూ సభను నిర్వహిండం చర్చనీయాంశంగా మారింది.
‘అంబెడ్కర్ యూకే సంస్థ‘ మరియు ‘ప్రవాస భారతీయ సంస్థ’ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కేసీఆర్ కృతజ్జత సభ ఘనంగా జరిగింది. డా. బిఆర్. అంబెడ్కర్ గారి కీర్తి ప్రపంచానికి చాటి చెప్పేలా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం, తెలంగాణ సచివాలయానికి అంబెడ్కర్ పేరు పెట్టడం, సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్నివిజయవంతంగా అమలు చేస్తుండడం...పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సిఎం కెసిఆర్ ని అభినందిస్తూ సభ జరిగింది. యూకే పార్లమెంట్ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన " కెసిఆర్ కృతజ్ఞత సభ" కు యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ , నవేదు మిశ్ర, బారోన్ కుల్దీప్ సింగ్ సహోట, ఇంకా పలువురు స్థానిక కౌన్సిలర్లు హాజరయ్యారు. బ్రిటన్ లో నివసిస్తున్న పలువురు ప్రముఖ ఎన్నారైలతో పాటు, స్థానిక ప్రవాస సంఘాల నాయకులు, తెలంగాణ ఎఫ్ డి సీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తదితరులు ఈ కృతజ్జతా సభకు హాజరై సిఎం కేసీఆర్ కు అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.

తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









