మరోసారి స్వర్ణ దేవాలయం వద్ద పేలుళ్లు.. ఐదుగురి అరెస్ట్
- May 11, 2023
పంజాబ్: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. తాజా ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్లు జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. గత అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దీనికి కారకులుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అశాంతి నింపడమే లక్ష్యంగా పేలుళ్లు జరుపుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా పేలుడు సమయంలో అక్కడికి సమీపంలోని ఓ గదిలో ఉన్న ఇద్దరు పురుషులు, ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేలుడు కోసం పొటాషియం క్లోరేట్‌ను ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీస్ కమిషనర్ నౌనిహాల్ సింగ్ తెలిపారు.
అంతకుముందు మే 6, మే 8న కూడా స్వర్ణ దేవాలయం వీధిలో పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 30 గంటల వ్యవధిలో సంభవించిన ఈ రెండు పేలుళ్లపై విచారణ కోసం పంజాబ్ పోలీసులు దర్యాప్తు సంస్థల సాయం తీసుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇటీవల రెండోసారి జరిగిన పేలుడు ప్రాంతాన్ని సందర్శించింది. తొలి పేలుడు సమయంలో ఓ వ్యక్తి గాయపడగా సమీప భవనాల్లోని అద్దాలు పగిలిపోయాయి. మే 8న సంభవించిన రెండో పేలుడు తీవ్రత కొంత తక్కువే అయినా మరో వ్యక్తి గాయపడ్డాడు. పేలుళ్లకు ఉపయోగించిన ట్రిగ్గర్ కానీ, ఎలాంటి పరికరం కానీ ఆ ప్రాంతంలో పోలీసులకు ఇప్పటి వరకు లభ్యం కాలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







