ఒమన్‌లో కారు ఢీకొని ఆసియా వాసి మృతి
- May 12, 2023
మస్కట్ : అల్ దహిరా గవర్నరేట్‌లో వాహనం, మోటార్‌సైకిల్ ఢీకొన్న ఘటనలో ఒక ప్రవాసుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్ దహిరా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ ఇబ్రిలో ఒక వాహనం మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది.ఈ ఘటనలో ఆసియా జాతీయతకు చెందిన మోటర్‌సైకిలిస్ట్ మరణించాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అధికారి తెలిపారు.గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఇబ్రి ఆసుపత్రికి తరలించినట్లు సదరు అధికారి వెల్లడించారు.వాహనాలు మరియు ద్విచక్రవాహనాల డ్రైవర్లు ట్రాఫిక్ భద్రతా నియమాలు, నిబంధనలను పాటించాలని ROP పిలుపునిచ్చింది.
ట్రాఫిక్ చట్టం ప్రకారం.. రోడ్డుపై నిర్లక్ష్యంగా, ప్రజల ప్రాణాలను లేదా ఆస్తులను ప్రమాదానికి గురిచేసే విధంగా లేదా ప్రమాదకరమైన లేదా నిషిద్ధ ప్రదేశంలో లేదా ఎటువంటి కారణం లేకుండా ఓవర్‌టేక్ చేసినా, శిక్షించబడతారు. 10 రోజుల కంటే తక్కువ.. రెండు నెలలకు మించకుండా జైలు శిక్ష, OMR 100 కంటే తక్కువ.. OMR 500 మించకుండా జరిమానా లేదా ఈ రెండు శిక్షలలో ఒకటి విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







