ఫేక్ యాడ్స్, లింకుల పట్ల జాగ్రత్త..!
- May 12, 2023
షార్జా: ప్రసిద్ధ కంపెనీల లోగోను కలిగి ఉన్న ఫేక్ యాడ్స్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షార్జా పోలీసులు హెచ్చరించారు.తప్పుడు ప్రకటనలు, ప్రమోషన్ పద్ధతులను ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా ఇటీవల వ్యాప్తి చెందుతున్న ఎలక్ట్రానిక్ మోసాల గురించి ప్రజలు, నివాసితులలో అవగాహన పెంచేలా ప్రకటనను విడుదల చేసింది. ఫేక్ రాయితీలు, ప్రమోషన్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా వ్యక్తిగత ధృవీకరణ నంబర్ (OTP) ను చెప్పవద్దని సూచించారు. అధికారిక పేరు లేదా లోగోను కలిగి ఉన్నప్పటికీ, ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఓటిపి వెల్లడించవద్దని షార్జా పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రహస్య కోడ్ ను ఏ బ్యాంక్, సంస్థ అడగదని తెలిపారు. మోసానికి గురైనప్పుడు (8002626) నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







