దుబాయ్‌లో ఫ్లాట్ లేదా విల్లాను అద్దెకు తీసుకుంటున్నారా?
- May 12, 2023
యూఏఈ: దుబాయ్‌లో ఫ్లాట్ లేదా విల్లాను మొదటిసారిగా అద్దెకు తీసుకోవాలని అనుకునే నివాసితులకు కొన్ని సందేహాలు ఉండవచ్చు. విధానాల నుండి డాక్యుమెంట్ అవసరాల వరకు ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు నిపుణులు సమాధానమిచ్చారు.
1. దుబాయ్‌లో ఆస్తిని అద్దెకు తీసుకోవడానికి ఉత్తమమైన ప్రాంతాలు ఏమిటి?
ఉత్తమ ఎంపికలు పూర్తిగా మీ జీవనశైలి మరియు బడ్జెట్‌పై ఆధారపడి ఉంటాయి. మీరు బీచ్ లేదా వాటర్‌ఫ్రంట్‌కు దగ్గరగా ఉండాలనుకుంటే దుబాయ్ మెరీనా, జుమేరా బీచ్ రెసిడెన్స్ (JBR), పామ్ జుమేరా గొప్ప ఎంపికలు. మీరు అర్బన్ హబ్‌ను ఇష్టపడితే, డౌన్‌టౌన్ దుబాయ్ మరియు బిజినెస్ బేలు మహోన్నతమైన ఆకాశహర్మ్యాలతో అద్భుతమైన ఎంపికలు. ఈ ప్రాంతాలన్నీ బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి నగరంలోని ఇతర ప్రాంతాల కంటే అద్దెలు చాలా ఎక్కువ.మీకు పిల్లలు ఉన్నట్లయితే, పార్కులు, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలకు యాక్సెస్‌తో పాటు మంచి పాఠశాలలకు దగ్గరగా ఉండాలనుకుంటే దుబాయ్‌లో అరేబియన్ రాంచెస్, దుబాయ్ హిల్స్ ఎస్టేట్ మరియు ఎమిరేట్స్ లివింగ్ వంటి గొప్ప కుటుంబ ఆధారిత టౌన్‌హౌస్, విల్లా కమ్యూనిటీలు ఉన్నాయి. దుబాయ్‌లోని జుమేరా విలేజ్ సర్కిల్ (JVC) మరియు జుమేరా విలేజ్ ట్రయాంగిల్ (JVT) తక్కువ అద్దెకు అపార్ట్‌మెంట్‌లు, టౌన్‌హౌస్‌లు మరియు విల్లాలను అందిస్తున్నాయి.
2. ఆస్తిని అద్దెకు తీసుకోవడానికి ఏ పత్రాలు అవసరం?
దుబాయ్‌లో ఆస్తిని అద్దెకు తీసుకోవడానికి, మీకు మీ పాస్‌పోర్ట్, నివాస వీసా మరియు ఎమిరేట్స్ ID కాపీ అవసరం. ఈ పత్రాలు లేకుండా, మీరు అద్దె ఒప్పందాన్ని చేసుకోలేరు. మీకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి మరియు మీ దేవా (విద్యుత్ , నీరు)ని సదుపాయాలను పొందటానికి అవసరం. మీ అద్దె, డిపాజిట్ , ఏజెన్సీ రుసుములను చెల్లించడానికి మీకు చెక్‌బుక్‌తో కూడిన UAE బ్యాంక్ ఖాతా కూడా అవసరం. మీరు దుబాయ్‌కి కొత్త అయితే, మీరు ఆస్తిని దీర్ఘకాలికంగా అద్దెకు తీసుకోవడానికి అవసరమైన పత్రాలను కలిగి ఉండే వరకు మీరు స్వల్పకాలిక వసతిని ట్రై చేయవచ్చు.
3. దుబాయ్‌లో అద్దెకు తీసుకునేందుకు ఖర్చులు ఉంటాయా?
అద్దెకు తీసుకునేటప్పుడు కొన్ని ఖర్చులు ఉన్నాయి. మొదటిది వార్షిక అద్దెలో 5 శాతం ఏజెన్సీ రుసుము. మీరు ఫర్నిచర్ సహిత ప్లాట్ తీసుకుంటే వార్షిక అద్దెలో 5 శాతం లేదా 10% సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి. చివరలో నష్టపరిహారం కోసం ఏవైనా తగ్గింపులను మినహాయించి, అద్దె ముగింపులో ఈ డిపాజిట్ వాపసు చేయబడుతుంది. మీ అద్దె ఒప్పందాన్ని నమోదు చేయడానికి, సుమారుగా Dh220 Ejari రుసుము ఉంది. అపార్ట్‌మెంట్‌లో మీ దేవాను యాక్టివేట్ చేయడానికి Dh2000 రీఫండబుల్ డిపాజిట్ , నాన్-రీఫండబుల్ కనెక్షన్ ఫీజు Dh100 ఉంది. విల్లాల కోసం, రీఫండబుల్ డిపాజిట్ Dh4000, కనెక్షన్ ఫీజు Dh300. ఇక ఎయిర్ కండిషనింగ్, గ్యాస్ కోసం డిపాజిట్లు మరియు యాక్టివేషన్ ఛార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అద్దెదారులందరూ (UAE జాతీయులు మినహా) దుబాయ్ మునిసిపాలిటీ రుసుమును కూడా చెల్లించాలి. ఇది వార్షిక అద్దెలో 5 శాతం వుంటుంది.
4. సబ్-లెట్ సురక్షితమేనా?
మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే లేదా అద్దెకు తీసుకోవడానికి మీకు సరైన పత్రాలు లేకుంటే సబ్-లెటింగ్ కు వెళ్ళవచ్చు. కానీ, ఇది అద్దె ఒప్పందం ద్వారా అనుమతించబడకపోతే, లేదా ఓనర్ నుండి అనుమతి లేకపోతే సబ్-లెటింగ్ చట్టానికి విరుద్ధం. మీ హక్కులు చాలా పరిమితంగా ఉంటాయి. మీరు చట్టబద్ధంగా సబ్‌లెట్ చేస్తే, అసలు రెంటర్స్ కు ఉండే సమానమైన హక్కులు మీకు ఉంటాయి. అనుమతి లేకుండా సబ్-లెటింగ్‌ను మంచి ఆప్షన్ కాదు. స్వల్పకాలిక వసతి వంటి ఇతర ఎంపికలను పరిగణించాలి.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







