చంద్రబాబు నాయుడుకు ఎపి సర్కార్ షాక్
- May 14, 2023
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చంద్రబాబు ప్రస్తుతం అమరావతిలోని కరకట్టపై ఉంటున్న గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూల్స్ వ్యతిరేకంగా కట్టిన కట్టడమని అందుకే చర్యలు తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి తమ పదవును దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారనే ఆరోపణలతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని.. కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలు నమోదయ్యాయి. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. వీళ్లు తమ పదవులను వినియోగించుకొని తమ బంధువులు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహించారంటూ అభియోగాలు వచ్చాయి. అయితే వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ఇందుకు ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలని సిబిఐ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను అధికారులు అటాచ్ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







