మార్చిలో 123 కొత్త పారిశ్రామిక లైసెన్సులు మంజూరు
- May 15, 2023
రియాద్: పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ (MIM) ఈ ఏడాది మార్చిలో 123 కొత్త పారిశ్రామిక లైసెన్సులను మంజూరు చేసింది. అత్యధిక లైసెన్సులు పొందిన కేటగిరీలో ఆహార ఉత్పత్తులు (19), రబ్బరు - ప్లాస్టిక్ ఉత్పత్తులు (15), లోహపు పని ఉత్పత్తులు (పరికరాలు, యంత్రాలు మినహా) (14 లైసెన్స్‌లు), నాన్-మెటాలిక్ ఖనిజ ఉత్పత్తులు (12), రసాయన పదార్థాలు (11) ఉన్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ మైనింగ్ ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి చివరి వరకు 332 పారిశ్రామిక లైసెన్స్‌లను జారీ చేసారు. ప్రస్తుతం 10,825 కర్మాగారాకు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ కర్మాగారాలు మొత్తం SR1.4 ట్రిలియన్ల పెట్టుబడి వ్యయాన్ని కలిగి ఉన్నాయి.
మార్చిలో కొత్త లైసెన్స్‌లలో SR3.9 బిలియన్లు పెట్టుబడులు వచ్చాయి. కొత్త పారిశ్రామిక లైసెన్సుల్లో చిన్న సంస్థలు 86.99% వాటాను కలిగి ఉండగా, మధ్యతరహా సంస్థలు 13.01% వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు జారీ చేయబడిన మొత్తం లైసెన్స్‌లలో జాతీయ పెట్టుబడులు అత్యధికంగా 73.17% ఉన్నాయ. ఆ తర్వాత విదేశీ పెట్టుబడులు 15.45%, జాయింట్ వెంచర్‌లు 11.38% చొప్పున కలిగి ఉన్నాయి.
12 ప్రాంతాలలో కొత్త పారిశ్రామిక లైసెన్సులు జారీ చేయగా.. రియాద్‌కు 46, తూర్పు ప్రావిన్స్ 29, మక్కా 18, ఖాసిమ్‌కు 11, హేల్ 6, అసిర్, జజాన్‌లకు మూడు చొప్పున లైసెన్సులు మంజూరయ్యాయి. తబుక్, మదీనా, అల్-జౌఫ్, అల్-బహా, నార్తర్న్ బోర్డర్ ఒక్కో లైసెన్స్ చొప్పున మంజూరయ్యాయి. నివేదిక ప్రకారం, పారిశ్రామిక రంగం మార్చిలో 10,500 కొత్త ఉద్యోగాలను సృష్టించింది.వీటిలో 7,255 ఉద్యోగాలు సౌదీ పౌరులకే దక్కడం గమనార్హం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







