‘అర్జున్ రెడ్డి’పై ఆ లేడీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- May 16, 2023
‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ తదితర సినిమాలతో లేడీ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నందినీ రెడ్డి.
యంగ్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ నందినీ రెడ్డి సినిమాలు. ఆమె నుంచి తాజాగా ‘అన్నీ మంచి శకునములే’ సినిమా వస్తోంది. ఈ నెల 18న ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది.
సంతోష్ శోభన్, మాళవిక జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా కథ గురించి చెబుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారామె.
ముందుగా ఈ సినిమాలో హీరోగా రౌడీ విజయ్ దేవరకొండను అనుకున్నారట. అయితే, ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ క్రేజ్ మామూలుగా లేదు. సో, తాను రాసుకున్న కథకు రౌడీ ఇమేజ్ సరిపడదని తర్వాత సంతోష్ శోభన్‌ను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేశాననీ చెప్పారామె.
అయితే, డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అయిన నందిని రెడ్డి వ్యాఖ్యలు మరోలా కన్వే అయ్యాయ్. విజయ్‌తో సినిమా చేయడం వేస్ట్ అన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. నెట్టింట నందినీ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తూ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెప్పిస్తున్నాయ్. అదీ సంగతి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







