ఆసక్తి రేకెత్తిస్తోన్న నిఖిల్ ‘స్పై’ టీజర్.!
- May 16, 2023
తెలియని విషయాలను తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలా మరణించాడు.? అసలు మరణించాడా.? లేదా.? లేదు లేదు ఆయన ఇంకా బతికే వున్నారట.! ఇలాంటి కథనాలు వింటూనే వుంటాం.
వాస్తవానికి ఆయన మరణం వెనక అసలు రహస్యం మాత్రం ఇంతవరకూ ఎవరికీ తెలీదు. ఆ సీక్రెట్‌ని రివీల్ చేసే కథగా వస్తోంది ‘స్సై’. సుభాస్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారన్న విషయం అందరూ కథలు కథలుగా చెప్పుకుంటే విన్నాం. అదే నిజమని నమ్మాం.
కాదు కాదు అది నిజం కాదని వ్యతిరేకించేవాళ్లూ లేకపోలేదు. అయితే, ‘స్పై’ సినిమాలో ఏదో తెలియని కొత్త కోణాన్ని చెప్పబోతున్నారని అర్ధమవుతోంది. ఆ మిస్టరీని ఛేదించే బాధ్యత గల స్సై పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడు.
‘కార్తికేయ 2’తో సూపర్ హిట్ కొట్టి జోష్ మీదున్న నిఖిల్‌కి ‘స్సై’ మరో మంచి సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తోంది. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌లో లావిషింగ్ యాక్షన్ ఎపిసోడ్లు ఇరగదీసేశాడు నిఖిల్ సిద్దార్ధ్.
ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ని ఐకానిక్ ల్యాండ్ మార్క్ అయిన న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రిలీజ్ చేయడం విశేషం. టీజర్‌కి మంచి రెస్సాన్స్ వస్తోంది. చూడాలి మరి, ఈ స్సై థ్రిల్లర్ ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







