వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కి చెక్.!

- May 16, 2023 , by Maagulf
వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కి చెక్.!

అధిక కొలెస్ర్టాల్ సమస్య ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది .కొలెస్ట్రాల్ అంటే పైకి కనిపించే ఊబకాయ మాత్రమే కాదండోయ్. పైకి లావుగా కనిపించకపోయినా బ్యాడ్ కొలెస్ర్టాల్ శరీరంలో పేరుకుపోతుంది. 

ఈ కొలెస్ర్టాలే వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుంతోంది. ఈ కొలెస్ర్టాల్ తగ్గించుకోవాలంటే ఆహార, జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోక తప్పదు.

కొలెస్ర్టాల్ కరిగించడానికి సహజ సిద్ధమైన మార్గాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది వ్యాయామం ఒకటి.

ఆ తర్వాత ఆహారంలో మార్పులు. గ్రీన్ టీ, లెమన్ టీ తదితర పానీయాలను రొటీన్ చేసుకోవాలి.

అలాగే, ప్రతీ రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ అయినా బ్రౌన్ రౌస్‌కి ప్రాధాన్యత ఇవ్వాలి. 

ముఖ్యంగా వెల్లుల్లితో బ్యాడ్ కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టేయొచ్చని అధ్యయనాల్లో తేలింది. 

వెల్లుల్లిలోని అల్లిసిన్ కొలెస్ర్టాల్ స్థాయుల్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

మన భారతీయ వంటల్లో వెల్లుల్లి పాత్ర అత్యంత కీలకం. వెల్లుల్లి తాలింపు లేకుండా పచ్చళ్లు కానీ, కూరలు కూడా వుండవు.

కానీ, ఇది సరిపోదు, వెల్లుల్లి వాడకాన్ని మరింత అధికం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి సూప్‌లు, సలాడ్స్‌లాంటివి ప్రిఫర్ చేయాలని చెబుతున్నారు. తద్వారా బ్యాడ్ కొలెస్ర్టాల్ ఈజీగా కరుగుతుందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com