సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
- May 16, 2023
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అవుతుంది. రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనుండడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులో షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతుండడంతో మరింత ప్రాధాన్యం నెలకొంది.
చివరిసారి ఫిబ్రవరి 5న కూడా తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు 4 కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ ఆ రోజున ఆమోదం తెలిపింది. వాటితో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని నెలలుగా… తెలంగాణ కేబినెట్ సమావేశమైన ప్రతిసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఇప్పటికే పలుసార్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







