అబుధాబి, దుబాయ్, ఫుజైరా, ఒమన్లను కలుపుతూ ‘ఎతిహాద్’ లగ్జరీ రైలు..!
- May 18, 2023
యూఏఈ: యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ డెవలపర్, ఆపరేటర్ అయిన ఎతిహాద్ రైల్.. ఇటాలియన్ లగ్జరీ హాస్పిటాలిటీ కంపెనీ ఆర్సెనలేతో ఎమిరాటీ సంస్కృతి, వారసత్వానికి తెలుపుతూనే విలాసవంతమైన రైలు అనుభవాన్ని అందించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. లగ్జరీ రైలు అబుధాబి, దుబాయ్, ఫుజైరా, ఒమన్లను కలుపుతూ లివా ఎడారి, దాని ప్రసిద్ధ ఒయాసిస్‌తో పాటు మెజీరా గుండా వెళుతుంది. సౌదీ అరేబియాలో ది డ్రీమ్ ఆఫ్ ది డెసర్ట్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల ప్రకటించిన తర్వాత ఇది ఆర్సెనేల్ రెండవ అంతర్జాతీయ లగ్జరీ రైలు ప్రాజెక్ట్.
అబుధాబిలో ఇటీవల ముగిసిన రెండు రోజుల మిడిల్ ఈస్ట్ రైల్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ సందర్భంగా యూఏఈలోని ఇటలీ రాయబారి లోరెంజో ఫనారా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం జరిగింది. ఎతిహాద్ రైల్ మొత్తం ఏడు ఒప్పందాలపై సంతకం చేసినట్లు ఎతిహాద్ రైల్ సీఈఓ షాదీ మలక్ తెలిపారు. విలాసవంతమైన రైలు అనుభవాన్ని కల్పించడం ద్వారా తాము ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రపంచ-స్థాయి ఆఫర్‌ను పరిచయం చేస్తున్నామన్నారు. యూఏఈలో పర్యాటక రంగాన్ని పెంచడానికి దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభించబడిన నేషనల్ రైల్ నెట్వర్క్, ఇప్పుడు అన్ని ఎమిరేట్లను కలుపుతూ నివాస, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలను యూఏఈ అంతటా నాలుగు కీలక ఓడరేవులతో కలుపుతోంది.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







