ఐపీఎల్‌ 2023: హైద‌రాబాద్ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

- May 18, 2023 , by Maagulf
ఐపీఎల్‌ 2023: హైద‌రాబాద్ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

హైదరాబాద్: ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు ఓపెన‌ర్లు దుమ్మురేపారు. విరాట్ కోహ్లి సెంచ‌రీతో ఉతికారేయ‌డంతో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (100; 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌గా డుప్లెసిస్‌(71; 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దంచికొట్టాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్ చెరో వికెట్ తీశారు.

అంత‌క‌ ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్‌(104 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. 49 బంతుల్లో ఐపీఎల్‌లో త‌న మొద‌టి శ‌త‌కాన్ని అందుకున్నాడు. మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్‌( 27నాటౌట్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అభిషేక్ శ‌ర్మ‌(11), రాహుల్ త్రిపాఠి(15), మార్‌క్ర‌మ్‌(18)లు విఫ‌లం అయ్యారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో బ్రేస్‌వెల్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, షాబాద్ అహ్మ‌ద్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com