సౌదీ అరేబియాలో స్వస్తిక్ గుర్తు తెచ్చిన తంటా...
- May 19, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ఇంటి గుమ్మానికి స్వస్తిక్ చిహ్నం పెట్టినందుకు ఓ ఈ మధ్యే దుబాయ్ నుండీ సౌదీ అరేబియాకు వచ్చిన ఇంజనీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాజీ , హిట్లర్ గుర్తులంటూ సౌదీ అరేబియాలో తను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ఫిర్యాదుతో అరెస్ట్ అయ్యాడు.
ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు ఉంటే వాస్తు దోషాలు తొలగి, సకల కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. కొత్తగా విదేశాలకు వెళ్లి ఉద్యోగంలో చేరిన వారు ఇవన్నీ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. కానీ, ఇలా గుమ్మానికి స్వస్తిక్ గుర్తు వేయించుకున్న ఓ తెలుగు ఇంజనీరు సౌదీ అరేబియాలో కటకటాలపాలయ్యారు. దుబాయ్ లో పనిచేసే ఏపీలోని గుంటూరుకు చెందిన ఆ ఇంజనీరు నెల రోజుల క్రితం సౌదీ అరేబియాలోని ఓ ప్రముఖ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు.
కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన.. అల్ ఖోబర్ నగరంలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శుభసూచకంగా తన ఫ్లాటు ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తును వేశారు. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న స్థానిక అరబ్ జాతీయుడి దృష్టి దానిపై పడింది.
అరబ్ వ్యక్తి దీనిపై ఏ మాత్రం చర్చ లేకుండానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం పోలీసులు వచ్చి తెలుగు ఇంజనీరును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నారు. ఆయన భార్య న్యాయ సహాయం కోసం ప్రయత్నిస్తున్నారు.
విషయం తెలుసుకున్న తెలుగు సామాజిక సంస్థ సాటా ఈస్ట్ ప్రెసిడెంట్ తేజ, మరియు కోబార్ సిటీ ప్రెసిడెంట్ లు విశయం తెలుసుకున్న వెంటనే వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించి బరోసా అందించారు. ఎంబసీ మరియు ఇంజనీరు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం తో చర్చించినారు.
సాటా సెంట్రల్ రీజియన్ ప్రధాన కార్యదర్శి ముజమ్మిల్ హుటాహుటిన అల్ ఖోబర్ చేరుకొని ఇంజనీర్‌ను విడిపించడానికి యత్నిస్తున్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియని అరబ్బులు స్వస్తిక్ గుర్తును నాజీల చిహ్నంగా పొరపాటు పడ్డారు. జాతి వివక్షకు సంబంధించిన ఏ రకమైన చిహ్నాలను ప్రదర్శించినా సౌదీ సహా గల్ఫ్ దేశాలన్నింట్లో నేరంగా పరిగణిస్తారు.
సాటా ఈస్ట్ ప్రెసిడెంట్ తేజ, మరియు కోబార్ సిటీ ప్రెసిడెంట్ లు విషయం తెలుసుకున్న వెంటనే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బరోసా అందించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







