తారక్‌కి బిస్కట్లేస్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.!
- May 19, 2023
ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ బెస్ట్ మూవీ ‘సింహాద్రి’ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్‌ని గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తున్నారు.
ఆ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసేశారు. ఈ ఈవెంట్‌కి మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ని గెస్ట్‌గా ఆహ్వానించారు. అసలే మాస్ కా దాస్ అంటేనే అతి. ఇక, ఎన్టీయార్ సినిమా ఈవెంట్ కోసం మనోడ్ని గెస్ట్‌గా పిలిస్తే ఇంకేమైనా వుందా.?
భూమ్మీద నిలబడ్డం లేదు. ఎన్టీయార్‌ని ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తూ తన క్రేజ్‌ని మరింత డబుల్ చేసుకుంటున్నాడు.
ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీయార్‌ని విశ్వక్ సేన్ గెస్ట్‌గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ హంగామాలో వున్నప్పటికీ ఎన్టీయార్, విశ్వక్ సేన్ ఆహ్వానాన్ని మన్నించి ఆ ఈవెంట్‌కి హాజరయ్యాడు.
అలా మనోడికి ఎన్టీయార్ అంటే అంతులేని అభిమానం ఏర్పడింది. దాంతో, ఇదిగో ఇలా ఎన్టీవోడు అంత గొప్పోడు.. ఇంత గొప్పోడు.. అంటూ తెగ పొగిడేస్తున్నాడు. ఓ స్టార్ హీరో సినిమా ఫంక్షన్‌కి చిన్న హీరో గెస్ట్‌గా రావడమంటే అది విశేషమేగా మరి. మాస్ కా దాస్ ఎగ్జైట్‌మెంట్‌లోనూ ఆమాత్రం వుంటుంది లెండి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







