ఈ సారి మాత్రం ప్యాన్ ఇండియా టార్గెట్ పక్కా.!
- May 19, 2023
‘కార్తికేయ 2’ సినిమాతో అనూహ్యంగా నార్త్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి నార్త్ జనం పట్టం కట్టారు.
అలా నార్త్ ఆడియన్స్‌లో నిఖిల్ బాగా రిజిస్టర్ అయిపోయాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ సినిమాకి ఈ ఇమేజ్‌ని వాడుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు నిఖిల్.
కానీ, ఇప్పుడు నిఖిల్ తాజా సినిమా ‘స్సై’ మాత్రం ప్యాన్ ఇండియాని టార్గెట్ చేస్తోంది. యూనివర్సల్ కంటెంట్ కావడంతో, నార్త్ పైనా ఈ సినిమాకి ఫోకస్ వుందట.
ఆ దిశగానే ప్రమోషన్లు షురూ చేశారు నిఖిల్ అండ్ టీమ్. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన సీక్రెట్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారట. పూర్తిగా ఫిక్షనల్ కాకుండా, కొంత మేర యదార్ధ ఘటనలను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారట.
అవసరమైన కొన్ని సీన్ల కోసం ఫిక్షన్ వాడినట్లు నిఖిల్ ప్రమోషన్లలో వివరణ ఇచ్చాడు. గ్యారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







