కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
- May 20, 2023
బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఆయనకు డిప్యూటీగా (ఉప ముఖ్యమంత్రి) డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని బెంగళూరలోని కంఠవీర స్టేడియంలో వీరి చేత గవర్నర్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక వీరితో పాటు ఎనిమిది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ -ముస్లీం)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు హాజరు అయ్యారు. వీరితో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, బిహార్ డీసీఎం తేజశ్వీ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవం ద్వారా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీజేపీయేతర పార్టీల్లోన్ని కొన్ని పార్టీలకు మాత్రమే సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానాలు అందాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పలువురు ముఖ్యమంత్రులు, నేతలను ఫోన్ ద్వారా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. వీరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాలకు ఖర్గే ఆహ్వానాలు పంపించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







