అరబ్ ఐక్యతకు ‘జెడ్డా డిక్లరేషన్’

- May 20, 2023 , by Maagulf
అరబ్ ఐక్యతకు ‘జెడ్డా డిక్లరేషన్’

జెడ్డా: ప్రజలకు శ్రేయస్సు, సంక్షేమంతో పాటు సురక్షితమైన, స్థిరమైన ప్రాంతాన్ని సాధించడానికి తమ ఐక్యతను మరింత సుస్థిరం చేసుకోవాల్సిన అవసరాన్ని ఒక-రోజు శిఖరాగ్ర సమావేశంలో అరబ్ నాయకులు పునరుద్ఘాటించారు. 32వ సాధారణ శిఖరాగ్ర సమావేశం ముగింపులో నాయకులు ఆమోదించిన జెడ్డా డిక్లరేషన్ ద్వారా సుస్థిర అభివృద్ధి, భద్రత, స్థిరత్వం, శాంతియుత సహజీవనం అరబ్ పౌరుల స్వాభావిక హక్కులు అని ప్రకటించారు. అరబ్ దేశాల్లో నేరాలను ఎదుర్కోవడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సమ్మిట్‌కు అధ్యక్షత వహించారు. ఇందులో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ మొదటిసారి పాల్గొన్నారు.  22 సభ్యుల కూటమిలో దశాబ్ద కాలంగా సిరియా దూరంగా ఉంది.

పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం, సూడాన్, యెమెన్, లిబియా మరియు లెబనాన్‌లలో తాజా పరిణామాలతో సహా దాని ఎజెండాలోని ప్రధాన అంశాలపై ఈ సదస్సు చర్చించింది. అరబ్ దేశాల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాలను డిక్లరేషన్ తిరస్కరించింది. "సాయుధ మిలీషియాల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడాన్ని మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అంతర్గత సైనిక వివాదాలు ప్రజల బాధలను మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరిస్తున్నాము" అని డిక్లరేషన్ లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com