వాయిదాల విక్రయాలను నిలిపివేయనున్న ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ కంపెనీలు..!

- May 20, 2023 , by Maagulf
వాయిదాల విక్రయాలను నిలిపివేయనున్న ఎలక్ట్రానిక్స్,  ఫర్నీచర్ కంపెనీలు..!

కువైట్: ప్రధాన ఎలక్ట్రానిక్స్,  ఫర్నీచర్ కంపెనీలు వాయిదాల పద్దతిలో వస్తువుల అమ్మకాలను నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా రంగాల్లోని కంపెనీలు అధ్యయనం చేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. వాయిదాలలో విక్రయించే వస్తువుల విలువను ప్రకటించిన ధర కంటే పెంచకూడదని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత కంపెనీలు ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. 3 సంవత్సరాలకు మించని వ్యవధిలో సమాన నెలవారీ వాయిదాలలో చెల్లించడానికి ఐదు వేల దినార్లకు వాయిదాల అమ్మకాలను సీలింగ్‌ను సెట్ చేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్, ఫర్నిచర్ కంపెనీలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని,  దేశంలోని ప్రధాన కంపెనీలు వాయిదాల విక్రయాలను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com