స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత..
- May 21, 2023
హైదరాబాద్: ఇటీవల టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుకి చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుకుడు రాజ్ కొద్ది సేపటి క్రితమే మరణించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. రాజ్–కోటి సంగీత ద్వయం టాలీవుడ్ లో చాలా పాపులర్. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు.
మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తో కలిసి రాజ్ దాదాపు 180 సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులో రాజ్ – కోటి ద్వయం సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి సంగీతం అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పాటలు అయితే ఇప్పటికీ వింటారు. రాజ్ – కోటి పేరు 90వ దశకంలో టాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది.
అయితే కొన్నేళ్ల క్రితం కోటి – రాజ్ మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. వీరు విడిపోయాక ఎక్కువగా సినిమాలు చేయలేదు. గత కొంతకాలంగా రాజ్ సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. కోటితో కాకుండా రాజ్ సింగిల్ గా సిసింద్రీ, రాముడొచ్చాడు, ప్రేమంటే ఇదేరా.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు రాజ్ ఇంటికి వెళ్తున్నారు. రాజ్ తండ్రి టీవీ రాజు కూడా సంగీత దర్శకులే.
రాజ్–కోటిలను విడిపోయాక కలపాలని చాలా మంది చూశారు. మెగాస్టార్, బాలసుబ్రహ్మణ్యం కూడా వీరిద్దర్నీ కలపడానికి ట్రై చేశారు. కానీ వీరు కలవలేదు. రాజ్ చివరిసారిగా ఇటీవలే బేబీ సినిమాలోని ఓ సాంగ్ లాంచ్ కి విచ్చేశారు. దీంట్లో చాలా సంవత్సరాల తర్వాత కోటి పక్కన కూర్చొని కనిపించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







