తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు
- May 21, 2023
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వానలు పడతాయంది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వానలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగుతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేశారు.
మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వానలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అదే సమయంలో అక్కడక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
వనపర్తి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని క్రిష్ణగిరి గ్రామంలో విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి. తీవ్రమైన గాలులకు గుడిసెలు, రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయి. గాలి వాన దుమారానికి గుడిసె కూలి మహిళ మృతి చెందింది. గాలి వాన బీభత్సతానికి ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. తీవ్ర గాలులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







