ప్రముఖ సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూత
- May 22, 2023
హైదరాబాద్: ప్రముఖ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత సమస్యలకు తోడు శరీరం మొత్తం సెప్సిస్ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయాయి. గత కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్‌మెంట్ తీసుకున్న ఆయన వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు. సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. శరత్‌బాబు మరణ వార్తతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. కాగా శరత్ బాబు పార్థీవ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







