7 మంత్రిత్వ శాఖల్లోని 84 మంది ఉద్యోగులు అరెస్ట్
- May 22, 2023
రియాద్: అనేక అవినీతి నేరాలకు పాల్పడిన తరువాత షవ్వాల్ నెలలో 7 మంత్రిత్వ శాఖలలో 84 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ పర్యవేక్షణ, అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) ఆదివారం తెలిపింది. అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసుల నిర్వహణను అథారిటీ చేపట్టింది. ఇందులో భాగంగా నజాహా 2,583 పర్యవేక్షణ పర్యటనలను నిర్వహించింది. దీని ఫలితంగా 211 మందిపై విచారణ చేపట్టింది. అధికార దుర్వినియోగం, లంచం, మనీలాండరింగ్, ఫోర్జరీ మధ్య విభిన్నమైన అనేక అవినీతి నేరాలలో నిందితులు ప్రమేయం ఉన్నారని, అరెస్టయిన 84 మందిలో కొంతమంది బెయిల్‌పై విడుదలయ్యారని నజాహా తెలిపింది. అరెస్టయిన వారు జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) వ్యక్తులతో పాటు అంతర్గత, రక్షణ, నేషనల్ గార్డ్, న్యాయం, ఆరోగ్యం, విద్య, పురపాలక, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలకు చెందినవారు ఉన్నారని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







