అబుధాబిలో అగ్ని ప్రమాదం..6 మంది మృతి, 7 మందికి గాయాలు
- May 22, 2023
యూఏఈ: అబుధాబిలోని మువాజాజ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలైనట్లు యూఏఈ క్యాపిటల్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంటలు అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత నెలలో దుబాయ్‌లోని అల్ రాస్‌లోని నివాస భవనంలోని నాల్గవ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 16 మంది మరణించగా.. తొమ్మిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







