అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర.. తెలుగు సంతతి యువకుడు అరెస్ట్
- May 24, 2023
అమెరికా: అమెరికా అధ్యక్షుడి హత్యకు తెలుగు సంతతి కుర్రాడు ప్లాన్ చేశాడని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు, లేదా ఆయన కుటుంబ సభ్యులను ఎవరినో ఒకర్ని చంపేందుకు ప్లాన్ చేసాడనే కోణంలో కందుల సాయి వర్షిత్ (19) తెలుగు సంతతికి చెందిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూహాల్ అనే పేరుతో ఉన్న ట్రక్‌లో సాయి వర్షిత్ వైట్ హౌస్ వద్ద కలకలం రేపాడు. అక్కడ ఉన్న బారికేడ్స్‌ను ట్రక్‌తో ఢీ కొట్టి వైట్హౌస్లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు.
అతన్ని విచారిస్తే అమెరికా అధ్యక్షుడిని , వైస్ ప్రెసిడెంట్‌ను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ చంపేందుకు కుట్ర పన్నినట్టు తెలిసిందని పోలీసులు అభియోగాలు మోపారు. సాయి వర్షిత్‌ను అరెస్టు చేసిన సమయంలో ట్రక్‌లో నాజీ జెండాను గుర్తించినట్టు పోలీసులు వివరించారు. అమెరికా అధ్యక్షుడిపై దాడికి ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్టు ఒప్పుకున్నాడని చెబుతున్నారు. సోమవారం రాత్రి 9:40 సమయంలో మిస్సౌరీలోని చెస్టర్ఫీల్డ్కు చెందిన సాయివర్షిత్ లాఫాయెట్ పార్క్‌కు సమీపంలో ఉన్న హెచ్ స్ట్రీట్ 1600 బ్లాక్‌లోని బోలార్డ్లపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







