కాంగోలో భారీ వర్షాలు : 443 మందికి చేరిన మృతుల సంఖ్య
- May 24, 2023
కిన్హాసా: దక్షిణాఫ్రికా దేశమైన కాంగోలో మే నెల ప్రారంభంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల వందలాది మంది మృతి చెందారు. తాజాగా ఈ భారీ వర్షాల కారణంగా మృతుల సంఖ్య 443 మందికి చేరిందని యుఎన్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్ (ఓసిహెచ్‌ఎ) మంగళవారం వెల్లడించింది. కాంగోలో కురిసిన భారీ వర్షాలకు ఎంతోమంది గాయపడ్డారని ఓసిహెచ్‌ఎ తెలిపింది. ఇక వరదలు, కొండచరియలు విరిగిపడం వలన అనేకమంది వ్యక్తుల ఆచూకీ తెలియలేదని ఓసిహెచ్‌ఎ పేర్కొంది. ప్రధానంగా వర్షాల వల్ల దక్షిణ కివు ప్రావిన్స్‌లో తూర్పు భూభాగంలోని కలేహే ప్రాంతలో మృతదేహాలను వెలికితీయడానికి లేదా పాతిపెట్టడానికి భారీ పరికరాలను అత్యవసరంగా అందజేయాలని రెస్క్యూ సిబ్బంది అభ్యర్థిస్తున్నారని ఓసిహెచ్‌ఎ తెలిపింది.
కాగా, ఈ వర్షాల వల్ల మూడు వేల కంటే ఇళ్లు, 9 వేలకు పైగా పాఠశాలలు దెబ్బతిన్నాయని ఓసిహెచ్ పేర్కొంది. అయితే అక్కడున్న ప్రజలకు ఆహారం, పాలు నీరు వంటివాటిని మానవతా వాదులు సరఫరా చేస్తున్నారు. వర్షా ప్రభావిత బాధితులకు ఆదుకునేందుకు సహాయక చర్యల్లో భాగంగా.. కాంగోలోని యుఎన్ హ్యుమానిటేరియన్ కోఆర్డినేటర్ బ్రూనో లెమార్క్విస్.. హ్యుమానిటేరియన్ ఫండ్ నుండి 3 మిలియన్ డాలర్లను కాంగోకి సాయం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..