‘ఆది పురుష్’కి సక్సెస్ ఫార్ములా అద్దబోతున్నారా.?
- May 25, 2023
ప్రబాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. వచ్చే నెల్లో రిలీజ్‌కి సిద్ధంగా వున్న ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా వున్నారు చిత్ర యూనిట్.
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఇంతవరకూ వున్న నెగిటివిటీని కాస్తయినా తుడిచి పెట్టే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. అలాగే, ఇక ఇప్పుడు మరో ప్రయత్నానికి తెర లేపారు.
సినిమాకి సెంటిమెంట్ ఆపాదిస్తున్నారు. అందులో భాగంగా, ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ప్రబాస్‌ని ప్యాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ‘బాహుబలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోనే చేశారు. ఆ సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. ఆ తర్వాత ప్రబాస్ నుంచి వచ్చిన ఏ సినిమా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.
సో, ‘ఆది పురుష్’ ద్వారా ఆ కల నెరవేర్చాలనుకుంటున్నారు కాబోలు. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. కనీసం ఈ సెంటిమెంట్ అయినా ప్రబాస్‌కి కలిసొస్తుందా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి