తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్: రేవంత్ రెడ్డి
- May 26, 2023
హైదరాబాద్: తెలంగాణ లో మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. అలాగే కాంగ్రెస్ , బిజెపి పార్టీలు సైతం ఈసారి ఎలాగైనా తెలంగాణాలో గెలిచి తీరాలని ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వాగ్దానాలు చేయడం మొదలుపెట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. కాంగ్రెస్ పీపుల్ మార్చ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర ఉన్న పాలమూరును అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తామన్న సీఎం కేసీఆర్ వాగ్ధానం ఏమయ్యింది అని ప్రశ్నించారు. బ్రతుకు దెరువు కోసం ఉన్న ఊరిని వదిలి లక్షల మంది వలస పోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







