బహ్రెయిన్ మెట్రో మొదటి దశ: 29 కి.మీ, 20 స్టేషన్లు

- May 26, 2023 , by Maagulf
బహ్రెయిన్ మెట్రో మొదటి దశ: 29 కి.మీ, 20 స్టేషన్లు

బహ్రెయిన్ : బహ్రెయిన్ మెట్రో మొదటి దశ 20 స్టేషన్లలో నడుస్తుందని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రవాణా,  టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం.. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా 109 కి.మీ. పరిధిలో రాబోతుంది. ప్రాజెక్టు మొదటి దశలో అత్యంత ముఖ్యమైన ప్రదేశాల గుండా సాగే 29 కి.మీ పొడవు (20 స్టేషన్‌లు) గల మార్గాన్ని ప్రారంభించారు. వీటిలో ముహర్రాక్, కింగ్ ఫైసల్ హైవే, జుఫైర్, డిప్లొమాటిక్ ఏరియా, సీఫ్ డిస్ట్రిక్ట్, సల్మానియా, అధారీ మరియు ఇసా టౌన్ ఉన్నాయి. బహ్రెయిన్ మెట్రో మొదటి 35 సంవత్సరాల ఒప్పందం కోసం ప్రైవేట్ రంగ సహకారంతో నిర్మించారు. బహ్రెయిన్ రాజ్యంలో బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రాజెక్టులలో ఒకటి అని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. బహ్రెయిన్ మెట్రో ప్రాజెక్ట్ ద్వారా రవాణా, రద్దీని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ప్రాజెక్ట్ ను రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com