ఎన్టీఆర్ నేషనల్ లెజెండరీ అవార్డుల లోగోను ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్

- May 26, 2023 , by Maagulf
ఎన్టీఆర్ నేషనల్ లెజెండరీ అవార్డుల లోగోను ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్

హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డుల లోగోను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి “మనం సైతం” స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ సీనియర్ నటుడు కాదంబరి కిరణ్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీపీసీ అధ్యక్షుడు చైతన్య జంగా, తెలుగు సినిమా వేదిక అధ్యక్షుడు వీఎస్‌ వర్మ పాకలపాటి, అవార్డుల కమిటీ సభ్యులు విశ్వనాథ్‌, రాంచంద్‌, నాగార్జునరెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో గ్లోబల్ మోడల్ అవార్డు విజేత ఐశ్వర్యరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.ఎఫ్‌టీపీసీ అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని, మే 28న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్ ఆడిటోరియంలో ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులను పాల్గొని ఈ ఫిల్మ్ సొసైటీ అవార్డు వేడుకను నిర్వహించనున్నట్టు తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకుడు వీఎస్ వర్మ పాకలపాటి తెలిపారు.మిస్ గ్లోబల్ వరల్డ్ అవార్డ్ విన్నర్ ఐశ్వర్యరాజు ఇలాంటి గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com