అన్ని జాతీయులకు ఉద్యోగాలు.. ఫేక్ న్యూస్‌పై పోలీసులు హెచ్చరికలు
- May 26, 2023యూఏఈ: అన్ని జాతీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఫేక్ న్యూస్‌పై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.డిపార్ట్మెంట్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అజ్మాన్ పోలీస్ వివరణ ఇచ్చింది. అధికార యంత్రాంగం ప్రకారం.. పోలీసులు అన్ని దేశాల ప్రజలకు ఉపాధి అవకాశాలను తెరుస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. పుకార్లు అవాస్తవమని పోలీసులు ధృవీకరించారు.అటువంటి పుకార్లను వ్యాప్తి చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరిక జారీ చేశారు. వారు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు.. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అధికారిక మూలాల నుండి మాత్రమే వార్తలను పొందాలని, సమాచారం కోసం అనధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఆధారపడవద్దని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం