అరేబియా గల్ఫ్ స్ట్రీట్లో హిట్ అండ్ రన్ ఘటన.. 11 మందికి గాయాలు
- May 27, 2023
కువైట్: అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో 11 గాయపడ్డారు. వీరందరూ ఫిలిప్పీన్స్కు చెందినవారు. ఫిలిపినోల బృందం సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు సైక్లిస్టులు గాయపడ్డారు. వారిని ఢీకొట్టిన కారు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అనంతరం అధికారుల వద్ద లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. లైసెన్స్ లేకుండా సైకిల్ క్రీడను ప్రాక్టీస్ చేయడం వారి ప్రాణాలకు ప్రమాదకరమని పేర్కొంటూ, ప్రధాన, పబ్లిక్ రోడ్లపై క్రీడలను అభ్యసించే వారందరూ నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
ఇదిలా ఉండగా అరేబియా గల్ఫ్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన తొమ్మిది మందిని ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరో ఇద్దరు వ్యక్తులు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారని, ఒకరు ఐసియులో.. మరొకరు గైనకాలజికల్ సర్జరీ వార్డులో ఉన్నారని పేర్కొంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







