రాహుల్ రామకృష్ణా.! ఏంటిదంతా పబ్లిసిటీ కోసమేనా.!
- May 27, 2023‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కమెడియన్‌గా పరచయమయ్యాడు రాహుల్ రామకృష్ణ. తెలంగాణా యాసతో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ యూత్‌లో ఓ సెన్సేషనే.
ఆ సెన్సేషన్తోనే అప్పుడప్పుడూ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ వుంటాడు. మొన్నా మధ్య తనకు కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇచ్చిన ఫోటో లీక్ చేసి, తన పెళ్లి వార్త బయట పెట్టాడు. ఆ రకంగా కొన్నాళ్ల పాటు రాహుల్ రామకృష్ణ వైరల్ అయ్యాడు.
అలాగే, పెళ్లి కాకుండానే తండ్రి అయ్యి మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా మనోడు మరోసారి తన ఉనికిని ఇన్నోవేటివ్‌గా చాటుకునే ప్రయత్నం చేశాడు.
అందుకు కారణం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన తాజా పోస్టే కారణం. అబ్బో పెద్ద పోస్టే పెట్టాడు కానీ, అసలు మ్యాటరేంటంటే తన ఈ పోస్ట్‌లో హైద్రాబాద్, హిందూ, ముశ్లిం.. అనే పదాలు వాడకమే.
ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతుండడంతో పాటూ, వివాదాస్పదమవుతోంది కూడా. అసలెందుకు రాహుల్ ఈ టైమ్‌లో ఇలా చేశాడు.? అంటే త్వరలో ఆయన నటించిన ’విమానం‘ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
ఈ నేపథ్యంలోనే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ఇలా చేశాడేమో రాహుల్ అని మాట్లాడుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు