ప్రబాస్ సినిమాలో విశాల్ హీరోయిన్.!
- May 27, 2023అప్పుడెప్పుడో విశాల్ హీరోగా నటించిన ’పొగరు‘ సినిమాలో లేడీ విలన్ రోల్ పోషించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? పేరు శ్రియా రెడ్డి. హీరోయిన్‌గానూ పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే, విశాల్ తో కలిసి చేసిన ’పొగరు‘ చిత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది శ్రియా రెడ్డికి. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ, ఓటీటీ వేదికగా పలు వెబ్ సిరీస్ లలో శ్రియా రెడ్డి కనిపిస్తోంది.
తాజాగా ప్రబాస్ సినిమాలో శ్రియా రెడ్డి నటించినట్లు తెలుస్తోంది. ప్రబాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ’సలార్‘ మూవీలో శ్రియా రెడ్డి ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ పాత్రతో మళ్లీ శ్రియా రెడ్డి ఈజ్ బ్యాక్ ఇన్ మూవీస్.. అనేలా వుంటుందట ఆ పాత్ర. సెప్టెంబర్ 28న ’సలార్‘ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
ఈ లోపే జూన్ 16న రిలీజ్ కాబోయే ’ఆది పురుష్‘ సినిమా ప్రదర్శించబోయే ధియేటర్లలో ’సలార్‘ గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనతో ’సలార్‘ టీమ్ వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్