విటమిన్ బి 12 లోపం కారణంగా తలెత్తే సమస్యలేంటో తెలుసా.?

- May 27, 2023 , by Maagulf
విటమిన్ బి 12 లోపం కారణంగా తలెత్తే సమస్యలేంటో తెలుసా.?

విటమిన్ల లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. దీర్ఘ కాలిక సమస్యలు సైతం విటమిన్ల లోపం కారణంగానే తలెత్తుతాయ్.

విటమిన్లంట్లోనూ విటమిన్ బి 12 శరీరానికి ఎంతో ఉపకరం. ఈ విటమిన్ లోపిస్తే శరీరానికి ఎక్కడ లేని నిస్సత్తువ, నీరసం ఆవహిస్తుంది. 

చాలా మందిలో ఈ విటమిన్ లోపం కారణంగా ఆకలి తగ్గిపోతుంది. రక్త హీనత సమస్యలు తలెత్తుతాయ్.

ముఖ్యంగా విటమిన్ బి 12 లోపం కారణంగా రక్త కణాల పరిమాణం తగ్గిపోతుంది. శరీరానికి ఎంతో ముఖ్యమైన డిఎన్ఏ తయారవ్వడానికి విటమిన్ బి 12 ఉపయోగపడుతుంది. పప్పు దినుసులతో పాటూ, మాంసం, చేపలు వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ ద్వారా విటమిన్ బి 12 ఎక్కువగా లభిస్తుంది. 

పెద్ద వాళ్లలో రోజుకు 2.4 మైక్రోగ్రాములు విటమిన్ బి 12 అవసరమవుతుంది. అలాగే, గర్భిణీ స్ర్రీలకు ఈ పరిమాణం ఇంతకన్నా ఎక్కువే. అందుకే గర్భిణీ స్ర్తీలు, పాలిచ్చే తల్లులు విటమిన్ బి12 అధికంగా వుండే ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకుంటూ వుండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com