కస్టమర్ సంతృప్తి సూచికలో ఒమన్ కు మూడవ స్థానం

- May 28, 2023 , by Maagulf
కస్టమర్ సంతృప్తి సూచికలో ఒమన్ కు మూడవ స్థానం

మస్కట్: 2022 సంవత్సరానికి కస్టమర్ సంతృప్తి సూచికలో ఒమన్ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచింది. తపాలా సేవల రంగం, ఒమన్ పోస్ట్‌లో ఎక్స్‌ప్రెస్ షిప్పింగ్ సొల్యూషన్‌లు, ఇ-కామర్స్, అస్యాద్ గ్రూప్ అనుబంధ సంస్థ అస్యాద్ ఎక్స్ ప్రెస్, దాని వివిధ కార్యకలాపాలలో 2022 సంవత్సరంలో గణనీయమైన వార్షిక వృద్ధిని సాధించింది. ఎక్స్‌ప్రెస్ పార్సెల్‌ల పరిమాణంలో 92 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఎక్స్‌ప్రెస్ మెయిల్ డెలివరీ రేటు 2021లో 93 శాతం నుండి 2022లో 98 శాతానికి పెరిగింది. డెలివరీ పనితీరు శాతం 2021లో 93 శాతంతో పోలిస్తే 98 శాతానికి పెరిగింది. ఈ సూచికలు ఒమన్ సుల్తానేట్‌ ను ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిపాయి. కస్టమర్ సంతృప్తి సూచిక పరంగా.. ఒమన్ పోస్ట్‌లోని కస్టమర్ సేవ 2021లో 43వ ర్యాంక్‌తో పోలిస్తే 2022లో ప్రపంచంలోని అత్యుత్తమ సేవలలో మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం కస్టమర్ సంతృప్తి స్కోర్ పోస్టల్ సేవలకు 92 శాతం, షిప్పింగ్, పార్సెల్‌లు మరియు ఎక్స్‌ప్రెస్‌లకు 90 శాతంగా ఉంది.

అంతర్జాతీయ డెలివరీ సేవలను విస్తరించడం, ప్రాంతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లతో మరిన్ని వ్యాపార అవకాశాల వ్యూహాత్మక లక్ష్యానికి కొనసాగింపుగా.. ఒమన్ పోస్ట్, అస్యాద్ ఎక్స్‌ప్రెస్ 2022 సంవత్సరంలో ఇ-కామర్స్, సరుకు రవాణా సేవలు, పార్సెల్‌  రంగంలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించగలిగాయి. 11 దేశాలకు  ఎక్స్‌ప్రెస్ మెయిల్ (మొరాకో, ఇరాక్, టాంజానియా, ఖతార్,  ట్యునీషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, కువైట్, టర్కియే) విస్తరించింది. మరోవైపు ఒమన్ పోస్ట్ 12 పోస్టల్ స్టాంపులను విడుదల చేయడానికి అనేక ప్రభుత్వ సంస్థలతో వివిధ భాగస్వామ్యాలను కుదుర్చుకుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com