‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ
- May 28, 2023
న్యూ ఢిల్లీ: నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులు, తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పేద, బడుగు వర్గాలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ నామస్మరణ మారుమోగిపోతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ‘101వ మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో నందమూరి తారక రామారావు గురించి ప్రస్తావించారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. కోట్లాది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. చిత్రరంగంతో పాటు రాజకీయ రంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రధాని కొనియాడారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించిన ఎన్టీఆర్.. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఆయన నటన ఇప్పటికీ స్మరిస్తారని మోదీ అన్నారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో ఖ్యాతిగాంచారని, కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారని ప్రధాని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







