కువైట్ లో పర్యాటక ఆదాయం.. GCC దేశాల కంటే అత్యల్పం..!
- May 28, 2023
కువైట్: ఇతర GCC దేశాలతో పోల్చితే.. కువైట్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం భాగస్వామ్యం అత్యల్పంగా ఉంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. కువైట్ జీడీపీలో పర్యాటక రంగం నుంచి 6.1 శాతం మాత్రమే కంట్రిబ్యూట్ ఉంది. అదే యూఏఈలో 10.8%, బహ్రెయిన్‌లో 9.8%, ఖతార్‌లో 9.7%, సౌదీ అరేబియాలో 9.4%, ఒమన్ లో 6.8%గా ఉంది. అయితే దేశం వెలుపల పర్యాటకం కోసం కువైటీ ఖర్చు చేసే మొత్తం సంవత్సరానికి 4 బిలియన్ దినార్ల కంటే ఎక్కువ ($14 బిలియన్లు) ఉందని నివేదికలో అంచనా వేశారు. ఇది GDPలో దాదాపు 11%కి సమానం కావడం గమనార్హం. అయితే పర్యాటకం నుండి దేశం వార్షిక ఆదాయం 300 వేల దినార్ల స్థాయిని మించడం లేదని అధ్యయనం తేల్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







