చరిత్ర సృష్టించిన ఎమిరాటీ వండర్ కిడ్..!

- May 29, 2023 , by Maagulf
చరిత్ర సృష్టించిన ఎమిరాటీ వండర్ కిడ్..!

యూఏఈ: నాలుగేళ్ల ప్రాడిజీ అతి పిన్న వయస్కుడైన మహిళా రచయిత్రిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగేళ్ల వయసులో ఆమె ఇప్పటికే ఒక పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కురాలిగా (మహిళ) గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (GWR)లోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టింది. అబుధాబి నివాసి అల్ఫాయ్ అల్ మర్జూకి ఇటీవల తన మొదటి చిత్ర పుస్తకాన్ని ది లాస్ట్ రాబిట్ పేరుతో ప్రచురించింది. సృజనాత్మకత, కథ చెప్పడం పట్ల అల్ఫాయ్ అభిరుచి ఆమె 'ది లాస్ట్ రాబిట్'లో ప్రస్పుటమైంది. అబుధాబి ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో ఈ పుస్తక సంతకం కార్యక్రమం విజయవంతమైంది. ఆమె తల్లి తీబ్ అల్ బార్రీ మాట్లాడుతూ..  “ఆమెకు నాలుగేళ్ల నుంచి కథలు వినడం అంటే చాలా ఇష్టం. ప్రశ్నలు అడగడానికి ఇష్టపడేది. ఆమె తండ్రి తన ప్రతిభను ప్రోత్సహించాడు. ఆమెకు అన్ని రకాల కలరింగ్ మెటీరియల్స్, స్టేషనరీ సామాగ్రిని తీసుకొచ్చి ఇచ్చాడు.  మేము ఆమె కళాకృతిని ప్రొత్సహించేందుకు ప్రత్యేక గదిని కేటాయించాం. అదొక చిన్న గ్యాలరీలా ఉంది. మేము ఆమె గదిలోకి వెళ్లి ఆమె సృష్టించిన 'కళాకృతిని' చూసి తరిస్తాం.’’ అని వ్యాపారవేత్త అయిన అల్ఫాయ్ తల్లి తెలిపారు.  బ్రిటన్‌లో అతి పిన్న వయస్కుడైన రచయిత్రి అయిన ఒక అమ్మాయి చిత్రాన్ని తాను ఆమెకు చూపించానని, తన కూతరు దాని నుంచి నిజంగా ప్రేరణ పొందిందన్నారు.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (DCT) అబుధాబి ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో అతి పిన్న వయస్కుడైన పబ్లిషర్ అనే బిరుదును ఇచ్చింది. Dh35, Dh45 ధరకు ఈ పుస్తకం ఆమె వెబ్‌సైట్‌ (www.fayoonah.ae) లో అందుబాటులో ఉంటుంది. త్వరలో అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలోకి రానుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాల్లు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే అధికారికంగా గుర్తింపు లభించే అవకాశం ఉందని తీబ్ అల్ బార్రీ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com