విద్యార్థికి విద్యుత్ గాయం.. జాజాన్ పాఠశాల నిర్లక్ష్యమే కారణమని పేరెంట్స్ ఆరోపణ
- May 29, 2023
జజాన్: దక్షిణ జజాన్ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి.. పాఠశాల వ్యాయామశాలలో ఉండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలకు గురయ్యాడు. విద్యార్థి సత్తం ఫకీహ్ పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లాడు. జాజాన్‌లోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ నాసర్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. సకాలంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం అందించడంలో పాఠశాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రమాదం గురించి కుటుంబీకులకు తెలియజేయడంలో పాఠశాల అధికారులు విఫలమయ్యారని, ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేశారని వారు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఘటన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కాగా, విద్యార్థి పరిస్థితికి సంబంధించి నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది నెటిజన్లు విద్యా అధికారులను కోరుతున్నారు.
సత్తం జజాన్‌లోని అబూ అరిష్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కింద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ప్రకారం.. పాఠశాల వ్యాయామశాలలో తన శారీరక విద్య సెషన్‌కు హాజరవుతున్నప్పుడు వాటర్ లీకేజీ కారణంగా కప్‌బోర్డ్ ఎయిర్ కండీషనర్‌ను టచ్ చేసిన సమయంలో విద్యార్థికి గాయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో విద్యార్థి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పాఠశాలలో హెల్త్ గైడ్ ఉన్నప్పటికీ బాలుడికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు పాఠశాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబీకులు వాపోయారు. కానీ వారు గాయపడిన విద్యార్థి సోదరుడిని పిలిపించారని, అతను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వివరించారు. సత్తం సోదరుడు అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ మూడో తరగతి చదువుతున్నాడు. ఆసుపత్రికి వెళుతుండగా అతని సోదరుడి కారులో మంటలు చెలరేగాయని తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాల అధికారులు విద్యార్థి సంరక్షకుడికి తెలియజేయలేదని, వ్యాయామశాలలో విద్యుత్ లోపం గురించి పాఠశాల అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి భద్రత, నివారణ చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గాయపడిన తమ కొడుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి ప్రథమ చికిత్స అందించడంలో ఆలస్యం చేయడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారిందని ఆరోపించారు. ఈ ఘటనపై జజాన్ ప్రాంతంలోని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి రాజా అల్-అట్టాస్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రీజియన్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









