‘వీర సవార్కర్’గా నిఖిల్.!

- May 29, 2023 , by Maagulf
‘వీర సవార్కర్’గా నిఖిల్.!

నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా ఓ కొత్త సినిమా రాబోతోంది. తాజాగా ఆ సినిమా టైటిల్ రివీల్ చేశారు చిత్ర యూనిట్. ‘ది ఇండియా హౌస్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాని తన కొత్త బ్యానర్ అయిన వి మెగా పిక్చర్స్‌పై రామ్ చరణ్ రూపొందిస్తుండడం విశేషం. ఇక సినిమా విషయానికి వస్తే, ఇదో స్వాతంత్ర్య వీరుడి కథ. 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాదిరి, మరుగున పడిపోయిన, దేశం మర్చిపోయిన ఓ స్వాతంత్ర్య యోధుడి గాధ. ఈ మధ్య ‘ది కశ్మీరీ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు ఏ విధంగా ప్రజాదరణ పొందుతున్నాయో చూస్తున్నదే.

అదే మాదిరి ‘ది ఇండియా హౌస్’ అనే టైటి‌ల్‌తో వస్తున్న ఈ సినిమా నిఖిల్‌ కెరీర్‌లో ఓ సెన్సేషనల్ మూవీ అవుతుందని ఆశిస్తున్నారు.

దేశద్రోహిగా ముద్ర వేయించుకున్న వీర సవార్కర్ అనే స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడీ సినిమాలో. 

ఇప్పటికే ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ వంటి సూపర్ హిట్లతో దూకుడు మీదున్న నిఖిల్, త్వరలో ‘స్పై’ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజా మూవీ నిఖిల్ కెరీర్‌ని మరింత ఉత్సాహపరిచేదిగా అనిపిస్తోంది చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com