ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- May 29, 2023
ఢిల్లీ: మే 26న టోక్యో నుండి న్యూఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో కార్డియాక్ అరెస్ట్‌కు గురైన సహ ప్రయాణికుడిని కార్డియోవాస్కులర్ సర్జన్ రక్షించారు. 57 ఏళ్ల మధుమేహ వ్యాధిగ్రస్తునికి గుండెపోటు వచ్చినప్పుడు, చండీగఢ్ కు చెందిన సీనియర్ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ దీపక్ పూరి వైద్య సేవలు అందించారు. కార్డియాలజిస్ట్ సలహాను అనుసరించి, విమానాన్ని సమీప విమానాశ్రయం కోల్‌కతాకు మళ్లించారు. అక్కడ రోగిని ఆసుపత్రికి తరలించారు. వైద్య బృందం, సిబ్బంది ఐదు గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించి రోగిని కాపాడారు. విమానం గమ్యస్థానానికి చేరుకునే వరకు అతను అతడిని జాగ్రత్తగా చూసుకున్నారు.
భారతీయ మీడియాతో డాక్టర్ పూరి మాట్లాడుతూ.. గుండెపోటు కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసిందని, రోగి కొంతకాలంగా పల్స్, గుండె చప్పుడు, మెదడు ప్రతిస్పందన లేకుండా వైద్యపరంగా మరణించాడని చెప్పారు. అటువంటి పరిస్థితులలో కార్డియాక్ సహాయం ప్రారంభించకపోతే.. మూడు నుండి ఐదు నిమిషాల్లో మెదడు శాశ్వతంగా డెడ్ అవుతుందన్నారు. ప్రస్తుతం రోగి క్షేమంగా ఉన్నారని, మెదడు, కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. డాక్టర్ పూరీ రెండు రోజుల కార్డియోమెర్షన్ వరల్డ్ హార్ట్ కాంగ్రెస్‌కు హాజరైన తర్వాత టోక్యో నుండి తిరిగి వస్తున్నారు. ప్రయాణికుడికి గుండె ఆగిపోవడంతో డాక్టర్ పూరీ వెంటనే సహాయం కోసం వెళ్లారు. ఫ్లైట్ సిబ్బంది సహాయంతో డాక్టర్ కార్డియాక్ మసాజ్ (CPR) చేసిన తర్వాత, రోగి తేరుకున్నాడు.
కాగా, సంఘటన జరిగినప్పుడు విమానం సముద్రం పైన ఉంది. అక్కడినుంచి ఐదు గంటల దూరంలో కోల్‌కతా విమానాశ్రయం ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకు విమానయాన సంస్థ ప్రత్యేకంగా అనుమతిని ఇచ్చింది. ల్యాండింగ్ అయిన వెంటనే, అంబులెన్స్ రోగిని సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ అతని 100% బ్లాక్ అయిన ఎడమ ధమనికి వెంటనే స్టెంట్ వేయడంతో అతను బతికాడని డాక్టర్ పూరీ తెలిపారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







