‘హనుమ్యాన్’ అసలు కథేంటంటే.!
- May 29, 2023
బుడ్డోడు తేజ సజ్జ హీరోగా రూపొందిన సినిమా ‘హనుమ్యాన్’. సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ తరహాలో రూపొందుతోన్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడు.
ప్రబాస్ సినిమా ‘ఆది పురుష్’ కారణంగా జూన్‌లోనే రిలీజ్ కావల్సిన ఈ సినిమాని మరి కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేశారు. ‘ఆది పురుష్’ ఫస్ట్ గ్లింప్స్ టైమ్‌లోనే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ కావడం, కనీసం ఈ చిన్నపాటి సినిమా క్వాలిటీతో కూడా ప్రబాస్ సినిమా పోటీ పడలేదన్న కంపేరిజన్స్ వచ్చాయ్.
దాంతో, ఈ చిన్న సినిమాకి మరింత వుత్సాహం వచ్చింది. టీజర్‌కి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మరింత ఫోకస్ పెట్టి ఈ సినిమాని ఇంకా బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్.
వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా బాగా జరుగుతోందట. హనుమంతుడి శక్తులు పొందిన ఓ అండర్ వరల్డ్ డాన్.. ఆ శక్తులతో ఏం చేశాడు.? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు.? అనే కథా, కథనంతో తెరకెక్కిన సినిమానే ‘హను మ్యాన్’. చూడాలి మరి, ఫస్ట్ ఇంప్రెషన్‌తోనే బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిన ‘హను మ్యాన్’ రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో.!
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







